ఔషపూర్ గ్రామానికి చెందిన కేతావత్ శంకర్, లక్ష్మీ దంపతుల ఇంట్లో దొంగతనం జరిగింది. కూతురు సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వారు నాగర్ కర్నూలు జిల్లాకు వెళ్లారు. ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లోని బంగారం, నగదు అపహరణకు గురయ్యాయని గుర్తించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు.