పాణ్యం: గడిగరేవులలో స్కూటర్, బైక్ ఢీ.. ముగ్గురికి గాయాలు
గడివేముల మండలం గడిగరేవుల పాల డైరీ వద్ద స్కూటర్, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆదివారం ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. నంద్యాల YSR నగర్ కాలనీకి చెందిన గుర్రప్ప, వెంకటరమణ స్కూటర్ మీద వస్తున్నారు. అదే కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు బైకులు రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లుతో పాటు మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.