ఎచ్చెర్ల: టెక్కలి మండలం అక్కవరం గ్రామ సమీప జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరోలారి డ్రైవర్ క్లీనర్ తీవ్ర గాయాల పాలై మృతి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అక్కవరం గ్రామ సమీప జాతీయ రహదారిపై బుధవారం ఉదయం7 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశ్రాంతి స్థలంలో ఆగి ఉన్న లారీను వెనుక నుంచి మరోలారి అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లో ఇరుక్కొని డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో అతి కష్టంగా మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.