విజయనగరం: ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించాల్సిన భాద్యత జిల్లా అధికారులదే: DRO
ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించాల్సిన భాద్యత జిల్లా అధికారులదేనని డి ఆర్ ఓ ఎస్.శ్రీనివాస మూర్తి స్పష్టం చేశారు. కేసులను పరిష్కారించే ముందు నోటీసులు జారీచేసి విచారించాలని, రికార్డ్ చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులు రీ ఓపెన్ కాకుండా చూడాలని అన్నారు. గడువులోగా వినతులకు పరిష్కారం చూపని యెడల, సంబందిత అధికారి పై చర్యలు తప్పవని హెచ్చరించారు .సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన పిజిఅర్ఎస్ లో జిల్లారెవిన్యూ అధికారి శ్రీనివాసమూర్తి ప్రజల నుండి వినతుల స్వీకరించారు. పిజిఆర్ఎస్ కు మొత్తం 162 వినతులు అందాయి.