పాములపాడు మండలం ఎర్రగుడురు గ్రామ శివారులోని పంట పొలాల్లో ఆదివారం ఉదయం ఎలుగుబంటి సంచారం, రైతులను గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది. ఆదివారం తెల్లవారుజామున రైతులు పంట పొలాల్లోకి నీళ్లు పెట్టేందుకు వెళ్లాగ, ఎలుగుబంటి తెలుగు గంగ ర్యాంపుల నుంచి సర్పంచ్ హనుమంతు సపోట తోటలోకి వెళుతుండగా, ఆ రైతులను గమనించి కూర్చొని ఉంది. దీంతో రైతులు భయాందోళన చెంది గ్రామంలోకి పరుగులు తీశారు. గత మూడు సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ఎలుగుబంటి మకాం వేసిందని గ్రామస్తులు వాపోతున్నారు. అటుకు శాఖ అధికారులు ఎలుగుబంటిని బంధించి అడవిలో వదలాలని కోరుతున్నారు.