కార్తీక మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్టాం - నెల్లూరు RDO అనూష
కార్తీక మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్టాం - నెల్లూరు RDO అనూష పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని RDO అనూష అధికారులకు సూచించారు. గురువారం ఉదయం మూలాపేటలోని మూలస్థానేశ్వర ఆలయంలో కార్తీక మాసోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో గురువారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖలవారీగా చేపట్టవలసిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డివో అనూష మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైందని, నవంబరు నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.