పెడబల్లిలో నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింధూర
ప్రజా సంక్షేమమే పరమావధిగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే సింధూర రెడ్డి కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడబల్లిలో జరిగిన నూతన గృహప్రవేశాల కార్యక్రమానికి ఎమ్మెల్యే సింధూర మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలెక్టర్ శ్యాం ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాట్లాడుతూ 16 నెలల్లో నెలకు సంక్షేమ కార్యక్రమం చొప్పున ప్రవేశపెడుతూ ప్రభుత్వం పేదలకు ఎంతో చేయూత ఇస్తోందన్నారు