ఫేక్ ప్రచారాలు చేయటం మొదటి నుంచి వైసీపీకి అలవాటేనని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు వైసిపి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగులుప్పలపాడు మండలంలో జరిగిన చిన్న సంఘటన జనసేన పార్టీకి అంటగట్టేందుకు వైసిపి ప్రయత్నించడంపై ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు. జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి జరిగిన ఘటనపై పూర్తి విచారణ జరిపాలి కదా అని ప్రశ్నించారు. అధికార వైసిపి ట్విట్టర్ పేజీలో జనసేనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వచ్చే స్థానిక ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ఇటువంటి పనులు వైసిపి చేస్తుందన్నారు.