నంద్యాల జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో 25మంది లబ్ధిదారులకు రూ.8.5 లక్షల విలువైన CMRF చెక్కులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. అనంతరం వైద్య సహాయం పొందిన రోగుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వారి యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.