భీమవరం: విశ్వకర్మ మహర్షి అందరికీ మార్గదర్శకం : ఎమ్మెల్యే రామాంజనేయులు
ప్రపంచానికి సృష్టికర్త, శిల్పకళా నిపుణుడు, వాస్తుశాస్త్ర పితామహుడుగా గౌరవింపబడే విశ్వకర్మ మహర్షి స్ఫూర్తి మనందరికీ మార్గదర్శకమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు భీమవరంలో స్వర్ణకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీవిరాట్ విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవచన, కంకణధారణ, విశ్వకర్మ ఆవాహన బ్రహ్మ కలశ పూజ, అభిషేకాలు నిర్వహించారు. సంఘం సభ్యులు పాల్గొన్నారు.