ఖమ్మం అర్బన్: పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రజలను ఉద్దేశించి తన సందేశాన్ని తెలియజేసారు.