భూత్పూర్: రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి రాయితీ లు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యత ఇస్తూ ఆర్ధికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.మంగళవారం భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆయిల్ ఫాం తోటలను సందర్శించారు.గ్రామంలో 4.5 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుచేస్తున్న మహిళా రైతు అర్.మంజుల తోటలో గెలలు కోతకు వచ్చిన సందర్భంగా కత్తిరింపులు ద్వారా వస్తున్న దిగుబడి పరిశీలించారు. ఇప్పటి వరకు 29 మెట్రిక్ టన్నుల తాజా ఆయిల్ ఫాం గెలలను కోసి కంపెనీకి విక్రయించినట్లు,తద్వారా 4 లక్షల 32 వేల ఆదాయం లభించిందని కలెక్టర్ కు రైతు తెలిపారు.ఫ్రీ యూనిట్ కంపెనీ వారు ఈ గెల లను ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం క