జమ్మలమడుగు: పోరుమామిళ్ల : పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన సీపీఐ బృదం
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్ట్, ఈఎన్టీ డాక్టర్, మత్తు డాక్టర్, ఎక్సేరా తీసే డాక్టర్, దంత వైద్యులు లేకపోవడంతో రోగులకు సరైన వైద్యం అందలేదని శుక్రవారం సీపీఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్,మండల కార్యదర్శి రవికుమార్, మండల సహాయ కార్యదర్శి కేశవలు తెలిపారు.పోరుమామిళ్ల పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ బృందంతో పర్యటించి పరిశీలించారు. ఈసందర్భంగా వారు ఆసుపత్రిలో 50 పడకలు పరిశీలించగా బెడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయన్నారు.