తిరుపతి జిల్లాలో ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలు వేధింపులకు దళిత యువకుడు ఆత్మహత్య... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
జిల్లాలో ఇటీవల ప్రవేట్ ఫైనాన్స్ సంస్థలు విచ్చలవిడిగా గ్రామాల్లో అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి పీడించుకు తింటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గూడూరు పట్టణంలోని మాలవ్య నగర్ కేంద్రంగా సి ఎఫ్ ఎల్ క్రిష్ అనే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది ఒత్తిళ్లు, వేధింపులకు ఆ సంస్థలో పనిచేసే కలెక్షన్ ఏజెంట్ బలయ్యాడు. తిరుపతి జిల్లా డక్కిలి మండలం నరసనాయుడు పల్లి గ్రామంలోని అరుంధతి వాడకు చెందిన ఎలికిచర్ల అనిల్ అనే దళిత యువకుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.