నల్గొండ: 60 ఏళ్ల వృద్ధుడు పదేండ్ల బాలికను రేప్ చేసిన ఘటనలో 24 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు
నల్లగొండ మండలం అన్నపర్తి గ్రామానికి చెందిన మర్రి ఉషయ్య (60), నాలుగవ తరగతి చదువుతున్న పదేండ్ల మైనర్ అమ్మాయి బడికి పోయి వచ్చి నిద్రపోతున్న సమయంలో ఒక్కతే ఉందని చూసి 28 మార్చి 2023న అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న అమ్మాయిని లేపి తినుబండరాలు ఇచ్చి మానభంగం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు తల్లి 29 మార్చి 2023న నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పోస్కో ఇన్చార్జి న్యాయస్థానం ఇన్చార్జి న్యాయమూర్తి రోజా రమణి మంగళవారం తీర్పు వెళ్ళవదించింది ఈ కేసులో నిందితునికి 24 సంవత్సరాల కారాగర శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.