గంగాధర నెల్లూరు: పెనుమూరు మండలం గొల్లపల్లిలో ఎమ్మెల్యే చొరవతో నూతన బోర్ ఏర్పాటు
పెనుమూరు మండలం గొల్లపల్లిలో తాగునీటి సమస్య నెలకొంది. సమస్యను గ్రామస్థులు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ దృష్టికి తీసుకుపోయారు. సమస్యను పరిష్కరిస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సోమవారం నూతన బోర్ డ్రిల్ చేశారు. బోరులో మంచి నీరు పడ్డట్లు గ్రామస్తులు తెలిపారు. సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకి వారు కృతజ్ఞతలు చెప్పారు.