డిసెంబర్ 31వ తేదీ నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే అఖిల భారత మహా సభలను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం కనిగిరి పట్టణానికి సిఐటి సభల ప్రచారాలతో చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ, ప్రతి శాఖలో పని చేసే కార్మికులు ఈ సభలలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. కార్మికులకు అందవలసిన జీతభత్యాలు వారి హక్కులను ఈ సభలో చర్చించడం జరుగుతుందని అన్నారు.