ఇబ్రహీంపట్నం: లింగోజిగూడ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు సిసి ఫుటేజీ విడుదల
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలోని లింగోజిగూడా చౌరస్తాలో దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఓ యువకుడు ధ్వంసం చేస్తుండగా స్థానికులు గమనించారు. విగ్రహం ధ్వంసం చేసే దృశ్యాలు సిసి కెమెరాలు రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు స్థానికులు తెలిపారు.