జగన్మోహన్ రెడ్డి హయాంలో మంజూరు చేసిన 15 మెడికల్ కళాశాలలో పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రవేటీకరణను నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో సోమవారం వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వము మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దుచేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని దర్శి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా వైసిపి ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. కోటి సంతకాల ప్రతుల వాహనాన్ని జిల్లా వైసీపీ నాయకులు జండా ఊపి ప్రారంభించారు.