నల్గొండ: తిరుమలగిరి సాగర్ మండలంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు
నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని యూరియా కోసం రైతులు బారులు తిరారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నుంచే యూరియా కోసం మహిళా రైతులు ఇంటి పనులు మానేసి మరి తెల్లవారుజాము నుంచి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ కు బారులు తీరారు. క్యూ లైన్ లో నిలబడి ఉన్న రైతులకు చివరి వరకు యూరియా దొరుకుతుందో దొరకదో అని అయోమయంలో రైతులు ఆవేదనను వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో యూరియాను అందించాలని డిమాండ్ చేశారు.