చిలకలూరిపేట మండలం, బొప్పుడి పంట కాలవలో మృతదేహం లభ్యం
చిలకలూరిపేట మండలం బొప్పూడి పంట కాలువలో గురువారం మృతదేహం కలకలం రేపింది. గ్రామానికి చెందిన వల్లెపు అంకమ్మ అతిగా మద్యం సేవించి మత్తులో కాలువలో పడి ఉంటారని గ్రామస్థులు తెలిపారు.అంకమ్మ మద్యానికి బానిసయ్యాడని భార్య రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ అనిల్ పరిశీలించారు. పోలీసులు మృతదేహాన్ని బయటికి తీపించి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.