కర్నూలు: సబ్సిడీ కోసం లంచం డిమాండ్… బ్యాంక్ అధికారుల పై చర్యలకు డిమాండ్
దళిత యువకులపై మానసిక హింస చేస్తూ సబ్సిడీ విడుదలకు లంచం డిమాండ్ చేస్తున్న ఇండస్ఇండ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీకాంతరెడ్డి, లీగల్ హెడ్ చైతన్య రమణలపై చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఏ. సిరిని కలిసి ఫిర్యాదు చేశారు.54.68 లక్షల విలువైన జెసిబి కోసం 12.50 లక్షలు డౌన్ పేమెంట్, 30 లక్షలు కంతులుగా చెల్లించినా, నెలరోజులు ఆలస్యం చేశారని బండిని సీజ్ చేసి దళితులపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్నారు.