తాడికొండ: భూగర్భ జలాలు పెరుగుదలకు ఊర చెరువులు ఎంతో అవసరం: సర్పంచ్ ముప్పాల మనోహర్
భూగర్భ జలాలు పెరుగుదలకు ఊర చెరువులు ఎంతో అవసరం తాడికొండ మండల పరిధిలోని బండారుపల్లి గ్రామంలో తాగునీటి సమస్య తీర్చేందుకు చెరువులు, ఊర చెరువులకు సాగర్ జలాలతో నింపారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముప్పాల మనోహర్ మాట్లాడుతూ.. భూగర్భ జలాలను పెంపొందించుకునేందుకు ఊర చెరువులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. నేడు పూర్తిగా చెరువులు నింపామని ఆయన తెలిపారు. ప్రజలకు వేసవికాలంలో ఎలాంటి త్రాగునీటి సమస్య లేకుండా చెరువులు నింపి తాగునీరు అందించనున్నామని అన్నారు.