శ్రీకాకుళం: నగరంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ వెల్లడి
శ్రీకాకుళం నగరంలో మంగళవారం తెల్లవారుజాము నుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది... ఒక్కసారిగా ఉన్నట్టు ఉండి మేఘమ్ మబ్బులు తో కమ్ముకొని, భారీ ఉరుములు శబ్దాలు శ్రీకాకుళం నగరం లో వినిపించాయి. వర్షం ఆగకుండా ఏకాదటిగా సుమారు మంగళవారం ఉదయం 11 గంటల వరకు కురిసింది. ఈ వర్షం వరి రైతులకు మేలు చేస్తుందని రైతులు భవిస్తున్నారు.. ఈ వర్షం కారణం గా శ్రీకాకుళం నగరం లోని పలు ప్రాంతాల్లోమరియు ముత్యాలమ్మ తల్లి హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో కూరగాయలు కొనుగోలు, అమ్మకం దారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. జిల్లావ్యాప్తంగా సుమారు 2సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ వెల్లడించింది.