శంకరంపేట్ ఆర్: //ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి//
+రంగంపేట పిఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతిస్వామి +
ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, భగవంతుని ఎడల అందరూ సమానులేనని శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి అన్నారు. బుధవారం చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి ఎక్స్ రోడ్లోని హరిహర ఎన్ క్లేవ్లో మహా గణపతి పంచాయిత తృతీయ వార్షికోత్సవం సందర్భంగా, నిర్వాహకులు హనుమంతరావు ఆధ్వర్యంలో, ఆలయంలో బుధవారం పూజారి రాఘవేందర్ పంతులు ఆధ్వర్యంలో, అభిషేకం, గణపతి హోమం, శివపార్వతుల కళ్యాణం, పూజలు ఘనంగా నిర్వహించారు.