మాచర్లలో అత్యధిక వర్షపాతం నమోదు
పల్నాడు జిల్లాలో గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం అత్యధికంగా మాచర్లలో 89.4 మిల్లీమీటర్ల నమోదయింది. అత్యల్పంగా దాచేపల్లిలో 2.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. క్రోసూరులో 9.4, దుర్గి 57.4, గురజాల 13.6, బెల్లంకొండ 30.6, వినుకొండ 21.6, ఈపూరు 31.8, రొంపిచర్ల 25.4, నరసరావుపేట 26.6, ముప్పాళ్ల 22.2, నకరికల్లు 47.8, రాజుపాలెం 36 మి. మి వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు.