పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని టిడిపి వేంపల్లి మండల కన్వీనర్ రామ మునిరెడ్డి, సీఐ నరసింహులు అన్నారు. వారి సేవలను నిరం తరం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉందన్నారు. శుక్రవారం కడప జిల్లా వేంపల్లి లో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక జడ్పీ హైస్కూల్ నుండి పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వరకు కూటమి నాయకులతో, విద్యార్థులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పించారు.