శ్రీకాకుళం: అంగన్వాడీలకు వేతనాలు పెంచాలన్న సీఐటీయూ జిల్లాఅధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయుడు
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లాఅధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) మహాసభ మంగళవారం హిరమండలంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ.. 2023 డిసెంబర్, 2024 జనవరిలో చేసిన 42 రోజులు సమ్మె పోరాటం చారిత్రాత్మకమైనదని అన్నారు. ఆ సమ్మెలు ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని వివరించారు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు