మేడిపల్లి: మండల పద్మశాలి సంఘ నూతన మండల అధ్యక్షుడిగా మ్యాకల రాజేశం,కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
మేడిపెల్లి మండల కేంద్రంలోని మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో అదివారం సాయంత్రం మేడిపెల్లి పద్మశాలి సంఘ సభ్యుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సభ్యులు. అద్యక్షులుగా మ్యాకల రాజేశం, ఉపాద్యాక్షులుగా దీకొండ గంగాధర్, కార్యదర్శి గా బండారి మహేష్, సహ కార్యదర్శి గా రాంపెల్లి మురళి, కొశాధికారిగా మ్యాకల కిషోర్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమీటికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.