నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చౌడేశ్వరి దేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని పల్లకిలో ఆసీనులను చేసి, ఆలయ మాడవీధుల గుండా విశేష పల్లకి సేవ నిర్వహించారు. ఇందులో ఆలయ సిబ్బంది, పూజారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.