అలంపూర్: రామచంద్ర నగర్ కాలనిలో సమస్యలను పరిష్కరించాలి -బీజేపీ
వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామచంద్రా నగర్ కాలనీలో అంగన్వాడీ కేంద్రం ప్రక్కన రోడ్డు మధ్యలో ఉన్న ప్రమాదపు గుంతకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మ్యాన్ హోల్ లాగా కప్పి తెరిచే విధంగా ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజులుగా వడ్డేపల్లి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బోయ రామకృష్ణ ఆధ్వర్యంలో పలు మార్లు వినతి పత్రాలు మున్సిపాలిటీ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. కమీషనర్ గారు వెంటనే స్పందించి కాలనీలో ఉన్న గుంతలపై కప్పి తెరిచే విధంగా కప్పులు ఏర్పాటు చేయించారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ నాయకులు పరిశీలించడం జరిగింది.