జమ్మలమడుగు: జమ్మలమడుగు : ద్విచక్ర వాహనదారునిపై... గుర్తుతెలియని వ్యక్తి దాడి, బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు
రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటున్న ద్విచక్ర వాహనదారునిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన కడప జిల్లా జమ్మలమడుగులో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం తెలిసిన వివరాల మేరకు జమ్మలమడుగులోని ప్రొద్దుటూరు రోడ్డులో బైపాస్ వద్ద పెద్దముడియం మండలం గరిశలూరుకు చెందిన దానియేలు విశ్రాంతి తీసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం గరిశలూరు నుంచి ప్రొద్దుటూరు కు బయలుదేరిన దానియేలు చెట్టు కింద తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి సేద తీరుతుండగా గుర్తు తెలియని దుండగుడు దాడి చేసి 50 వేల రూపాయలు విలువైన ద్విచక్ర వాహనం, 5వేలు విలువైన సెల్ ఫోన్ తో పరారైనట్లు తెలిపారు.