నారాయణపురం గోదావరి కాలువ పై వంతెన మరమ్మత్తులను పరిశీలించిన ఎమ్మెల్యే ధర్మరాజు, వివరాలు వెల్లడి
Eluru Urban, Eluru | Sep 15, 2025
ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద ఏలూరు కాలువ వంతెన ఇటీవల శిధిలావస్థకు చేరుకుని మరమ్మత్తులకు గురైంది. ఈనేపథ్యంలో స్థానిక ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో సమకూర్చిన నిధులతో బ్రిడ్జ్ మరమ్మత్తు పనులు చేపట్టగా, సోమవారం సాయంత్రం 4గంటలకు బ్రిడ్జి మరమ్మత్తు పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులు పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ నారాయణపురం వద్ద ఏలూరు కాలువ పై నూతన బ్రిడ్జి మంజూరుకు కొంత ఆలస్యం జరుగుతుండటంతో ప్రజలకు, వాహనాలు రాకపోకలకు, ప్రయాణికులకు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రిడ్జ్ తాత్కాలిక మరమ్మత్తు పనులు ప్రారంభించామన్నారు.