ఓటం మార్గమధ్యంలో బస్సు బోల్తా - స్వల్ప గాయాలు
కడప జిల్లా భాకరాపేట సిద్దవటం మార్గ మధ్యలో బ్రిడ్జి వంకలో బుధవారం బద్వేల్ నుండి కడపకు వెళ్తున్న పల్లెవెలుగు బస్సు పడింది.రక్షణ గోడ లేనందువల్ల కడప నుండి బద్వేల్ కి వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్ ఎదురుగా రావడం వలన ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ నలుగురు ప్రయాణికులకి స్వల్ప గాయాలయ్యాయి.గాయపడిన వారిని 108 వాహనంలో కడప రిమ్స్ కు తరలించారు. సిద్ధవటం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.