బేతంచెర్ల లో లేఔట్ లు క్రమబద్ధీకరించుకోండి : నగర పంచాయతీ కమిషనర్ హరి ప్రసాద్
Dhone, Nandyal | Sep 16, 2025 నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలో అనధికారికంగా ఉన్న లేఔట్లను క్రమబద్ధీకరించుకోవాలని నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ మంగళవారం తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని లేఅవుట్ యజమానులు, ప్లాటు కొనుగోలుదారులు వినియోగించుకోవాలన్నారు.క్రమబద్ధీకరణ చేయని వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.