పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ముట్టడికి వెళ్తున్న వైసీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయించి నిరసన
పల్నాడు జిల్లా,సత్తనపల్లి తాలూకా సెంటర్లో వైసీపీ నాయకులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ వద్దకు వెళుతున్న వైసిపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు ప్రభుత్వ కాలేజీ ఏ ముద్దు అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు.డౌన్ డౌన్ బిజెపి, కూటమి అంటూ స్లొగన్స్ ఇస్తూ బైటాయించడంతో పట్టణంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.