గోకవరం: ప్రజలకు పౌర సేవలు మెరుగైన విధానంలో అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు: కలెక్టర్ ప్రశాంతి
ప్రజలకు అందుబాటులో ఉన్న పౌర సేవలు విషయంలో క్యూ ఆర్ కోడ్ ద్వారా అందుతున్న సమాచారాన్ని విశ్లేషణ చెయ్యడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి సరైన పరిష్కారం అందించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి చిన్న రాముడు తదితరులు పాల్గొన్నారు