తాడిపత్రి: తాడిపత్రి నియోజకవర్గానికి పీఏబీఆర్ నీరు రావడంతో భూగర్భజాలాలు సమృద్ధిగా వస్తాయి: మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి
పీఏబీఆర్ నార్త్ కెనాల్ బ్రాంచ్ కు సాగు నీటిని అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి యాడికి మండలంలో గంగపూజ చేశారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రైతులతో కలిసి యాడికి మండలంలోని రాయల చెరువు వద్ద గంగాదేవికి పూజలు చేశారు. నార్త్ కెనాల్ నుంచి 250 క్యూసెక్కులు క్రిష్టిపాడు రెగ్యులేటర్ వద్దకు చేరి అక్కడి నుంచి మూడు భాగాలుగా విడిపోయి రాయల్ చెరువు, యాడికి కెనాల్, పెండేకల్ రిజర్వాయర్ కు చేరుతాయి. ఈ నీరు రావడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి.