యర్రగొండపాలెం: మిరియంపల్లి గ్రామంలో వైసిపి నాయకులు సుబ్బయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మిరియంపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు సుబ్బయ్య ను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శనివారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్య కారణంగా గుంటూరులో శాస్త్ర చికిత్స చేయించుకున్నారు. వారి స్వగృహం వద్ద ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.