సూళ్లూరుపేట హైవేపై రోడ్డు ప్రమాదం
- లారీ - ట్యాంకరు ఢీకొన్న ఘటనలో భారీగా స్తంభించిన ట్రాఫిక్
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి నెల్లూరు వెళ్తున్న లారీ, టాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. హైవేపై ప్రమాదం జరగడంతో భారీగా వాన రాకపోకలు స్తంభించాయి. ప్రమాదాలకు గురైన వాహనాలను పక్కకి తీయించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.