వనపర్తి: ఖిల్లా ఘనపూర్:మండల పరిధిలోని సమస్యత్మక గ్రామాలపై నిఘా పెంచాలి... సీఐ
పార్లమెంట్ ఎన్నికలవేళ పోలీసులకు అప్రమత్తత అవసరమని కొత్తకోట సిఐ యం. రాంబాబు అన్నారు.మంగళ వారం ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను సీఐ రాంబాబు మధ్యాహ్నం రెండు గంటలకు సందర్శించారు. ఎన్నికల సమయంలో పోలీసులు నిర్వహించాల్సిన విధులపై పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు. మండలంలోని సమస్యత్మక గ్రామాల్లో నిఘా పెంచాలన్నారు.ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఏ పార్టీ ప్రజాప్రతినిధులకు మద్దతుగా ఉండరాదని అన్నారు.