అసిఫాబాద్: నిబంధనలు పాటించని దుకాణాలను సీజ్ చేస్తాం:అగ్నిమాపక అధికారి కార్తీక్
నిబంధనలు పాటించకుంటే బాణాసంచా దుకాణాలు సీజ్ చేస్తామని ASF అగ్నిమాపక అధికారి కార్తీక్ హెచ్చరించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.. ASF డివిజన్ లో 30 బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు 14 రోజుల తాత్కాలిక లైసెన్స్ తో కూడిన అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. దుకాణాలు జనసంద్రం. నివాస ప్రాంతాలు లేనిచోట ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్నిమాపక అధికారులు సూచించిన అన్ని నిబంధనలు పాటించాలన్నారు. లేనిపక్షంలో వారి దుకాణాల అనుమతులను రద్దు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు.