బుగ్గారం: మద్దునూరు గ్రామంలో ఉరేసుకుని యువతి ఆత్మహత్య
ఉరేసుకొని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామంలో చోటు చేసుకుంది. బుగ్గారం ఎస్సై శ్రీధర్ రెడ్డి వివరాల ప్రకారం.. మద్దునూరు గ్రామానికి చెందిన బుర్ర అనూష (24) అనే మహిళ తండ్రి ఎనిమిది నెలల క్రితం మరణించాడు. తండ్రి చనిపోవడంతో తల్లి లక్ష్మీ పదే పదే మానసిక వేదనకు గురయ్యేది. దింతో మనస్తాపానికి గురైన అనూష శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు.