కొత్తగూడెం: డయల్ 100 కు ఫోన్ రాగానే త్వరితగతిన స్పందించి బాధితులకు అండగా నిలవాలి:జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్విస్టిగేషన్ ద్వారా నేరస్థులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆయన సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.