మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ వద్ద ఆదివారం గోదావరిఖని చెందిన సతీశ్ కుమార్ దంపతులు నిరుపేదలకు చేయూతనందించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని నిరుపేద ఆరు కుటుంబాలకు రూ.15వేల విలువ కలిగిన నిత్యవసర సరుకులను అందజేశారు. రామకృష్ణాపూర్ మూగజీవాల సంరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బాపూరావు చేతుల మీదగా పంపిణీ చేశారు.