భీమవరం: చినమిరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రామాంజనేయులు
చినమిరంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం స్వచ్ఛమైన తాగునీరు ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం చిన అమిరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ను బుధవారం ఉదయం 10:30 కు ఆయన ప్రారంభించారు. సురక్షితమైన తాగునీటిని అన్ని పాఠశాలల్లో అందిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛమైన నీరు జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరాన్ని శుభ్రపరుస్తుందని, చర్మాన్ని కాంతివంతం చేస్తుందని చెప్పారు.