కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్దమైన ఘటన మరువక ముందే.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మర్రిపల్లి వద్ద అలాంటి ఘటనే చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో.. మర్రిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును వెంటనే ఆపేసాడు. ప్రయాణికులు భయాందోళనకు గురై బస్సు దిగేశారు. ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరిపించుకున్నారు. ఈ ఘటన శనివారం రాత్రి 8 గంటల సమయంలో జరిగింది. మరో బస్సులో ప్రయాణికులను బెంగళూరుకి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్