అనంతపురం: గవర్నర్ చేత అసత్యాలు మాట్లాడించారు : అనంతపురంలో రాష్ట్ర మాజీ మంత్రి శైలజానాథ్
రాష్ట్రంలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత అసత్యాలు మాట్లాడించారని రాష్ట్ర మాజీ మంత్రి శైలజానాథ్ తెలియజేశారు. సోమవారం మధ్యాహ్నం అనంతపురం నగరంలోని జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.