అవనిగడ్డ: మోపిదేవి మండలంలో రెవెన్యూ గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: తహశీల్దార్ శ్రీవిద్య
మోపిదేవి మండలం కోక్కిలిగడ్డ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ గ్రామ సభలను నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ శ్రీవిద్య తెలిపారు. భూ సమస్యలపై అర్జీలు ఇచ్చిన రైతులకు 45 రోజులలో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు, మండల కో ఆప్షన్ సభ్యులు చందన రంగారావు పాల్గొన్నారు.