పులివెందుల: ఆధునిక యుగంలో మరొక విశ్వకర్మ మోక్షగుండం విశ్వేశ్వరయ్య : వేంపల్లి లో BJP జిల్లా అధికార ప్రతినిధి గాలి హరి
Pulivendla, YSR | Sep 15, 2025 ఆధునిక యుగంలో మరొక విశ్వకర్మ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని భాజపా జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు ఈ మేరకు సోమవారం వేంపల్లి రహదారులు భవనముల అతిధి గృహము ఆవరణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశ నిర్మాణ రంగంలో గొప్ప పాత్ర పోషించిన ఘనత వారికి దక్కుతుందని తెలిపారు ఆయన చొరవతో విశాఖపట్టణాన్ని సముద్రం కోతనుండి కాపాడాగలిగారని చెప్పారు. తిరుమల కు రెండవ ఘాట్ నిర్మాణం చేయడం జరిగిందని అన్నారు.